మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జీహెచ్ఎంసీ , జల్ పల్లి సర్కిల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలోని పంచముఖ హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో హనుమంతుని జయంతిని నాయకులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ఉత్సవాల ర్యాలీని ప్రముఖ వ్యాపారి వేత్త ఎడ్ల కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ
సందర్భంగా భజనలు, మేళతాళాలతో శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగింది, ఆంజనేయ స్వామికి వేద పండితులు తమలపాకులతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం వేలాదిమంది భక్తులతో జల్పల్లి మీదుగా మామిడిపల్లి, శ్రీరామకాలనీ అటు నుంచి పహాడీషరీఫ్ మీదుగా ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అంజన్న నామస్మరణతో పాటు శ్రీరామనామ నామస్మరణతో కాలనీలు, బస్తీలు దద్దరిల్లాయి. యువకులు కాషాయ వస్త్రాలు ధరించి వీధుల గుండా కాషాయ జెండాలను ఎగురవేశారు. జయంతి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. జై శ్రీరామ్ ఆంజనేయం నామస్మరణలతో మారుమోగుతున్నాయి.
ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ జయంతి ర్యాలీ

పహాడీషరీఫ్ సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ర్యాలీగా వెళ్లే రహదారుల్లో పోలీస్ సిబ్బందిని ఉంచి ర్యాలీ ప్రశాంతంగా జరిగే విధంగా చూశారు. సిఐ లక్ష్మీ నారాయణ రెడ్డి ఎస్ఐలు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య పోలీస్ బందోబస్తు ను పర్యవేక్షించారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు హనుమాన్ జయంతి ర్యాలీ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు వాసుదేవ రెడ్డి, నరేష్ యాదవ్, ధర్మారెడ్డి, నిమ్మల నరేందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సుక్క శివకుమార్, మద్ది రాజశేఖర్ రెడ్డి, లిక్కీ విజయేందర్ రెడ్డి, విశ్వనాథ్ గౌడ్, సుమన్ గౌడ్, కృష్ణ, లాల్ శ్రీకాంత్ గౌడ్, విగ్నేశ్వర్ ,నందీశ్వర్, గౌరీ మురళి, శేఖర్ గౌడ్, భక్తులు పాల్గొన్నారు.