MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 6:45 pm Posted by : MANA TOLIVELUGU

మిర్గం సందర్భంగా చేపల షాపులు కిటకిట 

ఉదయం నుంచే దుకాణాల వద్ద ప్రజలు బారులు జనం

చేపల సందడితో ట్రెడిషనల్ టచ్

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్

కందికల్ గేట్, బోయిగూడ వద్ద మిర్గం ( మృగశిర కార్తీ ) పర్వదినం సందర్భంగా చేపలను తినడం సంప్రదాయంగా భావించడం మన అనవాయితీ, రకరకాల చేపలను కొనుగోలు చేసేందుకు వచ్చిన జనంతో రోడ్లు కిటకిటలాడాయి. ఉదయం నుంచే చేపల దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు.

తెల్లవారుజాము నుంచే చేపల కొనుగోలుకు జనం తరలిరావడంతో దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. చేపల రేట్ల విషయని కొస్తే అపోలో ఫిష్ కిలో 300, రావు 150, పంప్లేట్ 150, రొయ్యలు 400, కొరమీను 150, వంటి రకరక చేపలకు భారీ డిమాండ్ కనిపించింది. రోడ్లపై పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. మిర్గం రోజున చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, ఆనందానికి సంకేతమని వినియోగదారులు చెప్పుకొచ్చారు.