MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 8:15 pm Posted by : MANA TOLIVELUGU

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ డిమాండ్

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి.రమేష్ :

నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26000 (ఇరవై ఆరు వేల ) జీతం ఇవ్వాలని నిజాంపేట్ సర్కిల్ ప్రజావాణిలో సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నుండి తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వరకు అందరు పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి వారి సమస్య పరిస్కారం కోసం అనేక వాగ్దానాలు చేశారు అని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులు ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లు పెట్టారు అని అన్నారు. అందులో రెండవ పీఆర్సీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణహింలరని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానని అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలిని డిమాండ్ చేశారు. అందరికి ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలనీ, అలాగే పండగ సెలవులు, వారాంతపు సెలవులు కూడిన సెలవలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నకంటి దస్తగిరి, జీ. శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.