మే 5న ఉద్యోగ జేఏసీ తలపెట్టిన నిరాహార దీక్ష విజయవంతం చేయండి – టీజీఈ జేఏసీ పిలుపు
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) చైర్మెన్ బావండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఐడిఓసీ కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర టీజీఈ జేఏసీ మే 5వ తేదీన ఉద్యోగులకు సంబంధించి 64 డిమాండ్ల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షకు నాగర్ కర్నూల్ జిల్లా సన్నాహక సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు నెరవేరేవరకు ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ సభ్యులు తెలియజేశారు....