మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను ఖండిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవల్లి సోషల్ మీడియా కన్వీనర్ చిట్టి రాజుల నరసింహ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో పారదర్శకత లోపించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.