విజయవంతంగా ఎడ్ల వెంకట్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు నగదు బహుమతులు..
అందజేసిన ఎడ్ల వెంకటరెడ్డి తనయులు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మామిడిపల్లి, దాసాంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎడ్ల వాసుదేవారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధి, మామిడిపల్లి గ్రామంలో ఆదివారం స్వర్గీయ ఎడ్ల వెంకటరెడ్డి స్మారక, ఎంపిఎల్-2026 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజయవంతంగా కొనసాగింది. 45 రోజుల పాటు కొనసాగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లో మొత్తం 7 జట్లు పాల్గొన్నాయి. ఈ మ్యాచ్ లో ఫైనల్ విజేతలుగా కింగ్ ఫిషర్ వారియర్స్, రన్స్ వారియర్స్ రన్నర్ గా జట్లు నిలిచాయి. విజేతలకు ఎడ్ల వెంకట్ రెడ్డి తనయులు వైష్ణోయ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ ఎడ్ల కృష్ణారెడ్డి, ఎడ్ల రాఘవేందర్ రెడ్డి, ఎడ్ల వాసుదేవారెడ్డి,ల సహకారంతో ట్రోఫీలతోపాటు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రతిభను గుర్తించడానికి దోహదపడతాయని తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో రాణించి వారి ప్రతిభను చాటుకోవాలన్నారు. వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని, క్రీడల వల్ల యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని తెలిపారు. సమాజంలోని ప్రస్తుతం యువత క్రీడల్లో రాణించాలని కోరారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని యువతకు పిలుపునిస్తున్నారు. డ్రగ్స్, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని యువతను కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు దిలీప్, ఏటీఎం, ధోని, రంజిత్, మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ కళ్లెం నరేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సుక్క శివకుమార్, మామిడిపల్లి బీజేపీ నాయకులు పేరమోని నరేష్ యాదవ్, ఈరంకి వేణుకుమార్ గౌడ్, గ్రామ నాయకులు నిమ్మల నరేందర్ గౌడ్, కోట్ల రంగనాథ్, నయీమ్ అడ్వకేట్, లీక్కీ శ్రీనివాస్ రెడ్డి, జగన్, రవి, శ్రీనివాస్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, రంగనాథ్, ప్రవీణ్ యాదగిరి, నరేందర్ యాదవ్, కృష్ణ గ్రామ యువకులు,తదితరులు పాల్గొన్నారు.