యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా శివచంద్రగిరి
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు నూతన నియామకాలు ప్రకటించారు. బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా శివచంద్రగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన శివచంద్రగిరి నియామకం అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, గంగాపురం కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు....