యూజీడీ సీసీ రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలి
భవానీనగర్ కాలనీ వాసుల డిమాండ్ మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి.రమేష్ : భవాని నగర్ కాలనీలో నెలల తరబడి నిలిచిపోయిన యూజీడీ, సీసీ రోడ్ల పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు మధ్యలో నిలిచిపోవడంతో కాలనీలో మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. రోడ్లు దెబ్బతిని ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, నీటి నిల్వలు, దోమల వ్యాప్తి, దుర్వాసన, ఆరోగ్య సమస్యలు...