MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 8:54 pm Posted by : MANA TOLIVELUGU

రాష్ట్ర ప్రభుత్వం విఓఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

రాష్ట్ర ప్రభుత్వం విఓఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని కందుకూరు, మహేశ్వరం మండలాలకు సంబంధించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఐకెపి) పరిధిలో పనిచేయుచున్న విఓఏ లు అందెల శ్రీరాములు ని నాదర్ గుల్ లోని నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే శాంతియుత నిరవధిక సమ్మెకు మద్దతును కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు విఓఏ లకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని.. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేసి గౌరవ వేతనం నెలకు 26 వేలుగా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18న నిర్వహించబోతున్నటువంటి నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.