రాష్ట్ర ప్రభుత్వం విఓఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య రాష్ట్ర ప్రభుత్వం విఓఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని కందుకూరు, మహేశ్వరం మండలాలకు సంబంధించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఐకెపి) పరిధిలో పనిచేయుచున్న విఓఏ లు అందెల శ్రీరాములు ని నాదర్ గుల్ లోని నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే శాంతియుత నిరవధిక సమ్మెకు మద్దతును కోరుతూ వినతిపత్రం...