MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 8:52 pm Posted by : MANA TOLIVELUGU

రాష్ట్ర సెల్ కన్వీనర్ కో – కన్వీనర్ ల సమావేశంలో కొలన్ శంకర్ రెడ్డి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

బీజేపీ కార్యాలయములో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావ్ అధ్యక్షతన వివిధ రకాల రాష్ట్ర సెల్ కన్వీనర్, కో- కన్వీనర్ ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విభాగాల సెల్ లను బలోపేతం చేయాలని కోరారు. భవిష్యత్తులో జిల్లా పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలలో సెల్ కమిటీలు ఏర్పాటు చూసుకోవాలన్నారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఈ నెలలో రాష్ట్రంలో జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తదితరుల పర్యటనలు ఉంటాయన్నారు. రాష్ట్ర బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ.. నాయకులు పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్ బీజేపీ సెల్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తో రాష్ట్ర బీజేపీ కో- ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి సమావేశమయ్యారు.