రాష్ట్ర సెల్ కన్వీనర్ కో – కన్వీనర్ ల సమావేశంలో కొలన్ శంకర్ రెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : బీజేపీ కార్యాలయములో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావ్ అధ్యక్షతన వివిధ రకాల రాష్ట్ర సెల్ కన్వీనర్, కో- కన్వీనర్ ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విభాగాల సెల్ లను బలోపేతం చేయాలని కోరారు. భవిష్యత్తులో జిల్లా పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలలో సెల్ కమిటీలు ఏర్పాటు చూసుకోవాలన్నారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న...