MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 8:04 pm Posted by : MANA TOLIVELUGU

రోగుల బంధువుల నుండి పైసా వసూల్..!

పేట్లబుర్జు ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రిలో పైసా వసుళ్ల పర్వం 

పట్టించుకోని ఆసుపత్రి అధికారులు

మన తొలివెలుగు, చంద్రాయన గుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ :

మెరుగైన వైద్యం అందించే పేట్లబుర్జ్ మెటర్నటీ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, అటెండర్లు, గర్భని స్త్రీలు, రోగుల బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనికి వెళ్లాలంటే చేతి వాటం అందించక తప్పడం లేదని వాపోతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీ ప్రసవించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినప్పుడు వారి బంధువుల నుంచి ఆడబిడ్డ అయితే రూ. 2,000, మగ బిడ్డ అయితే రూ. 3000  అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ప్రసవించిన అనంతరం మాతృమూర్తిని ఒక వార్డు నుంచి మరొక వార్డుకు తరలించడం, టీకాలు వేయడం వంటి సాధారణ సేవలకు కూడా 200 రూ, 500 రూ, డబ్బులు అడుగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి అక్రమంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న సెక్యూరిటీ సిబ్బందిపై మరియు అటెండర్ లపై(ఆర్ఎంఓ)  తగిన చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి వారిని డ్యూటీలో నుంచి తొలగించాలని ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులను చూసేందుకు, వచ్చే వాహనాల పార్కింగ్ కోసం గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఒక్కొక్కరి నుండి ₹10 నుండి ₹50 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..! ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత సేవలు అందించాల్సింది పోయి, ఇలా గేటు వద్దే దోపిడీకి పాల్పడటం పై ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయం పై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి, సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆసుపత్రి ఆర్ఎంఓ పై కూడా అనుమానాలు..!

ఈ వ్యవహారంలో పెట్లబుర్జ్ మెటర్నటీ ఆసుపత్రి ఆర్ఎంఓ పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి లో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఆర్ఎంఓ మానిటింగ్ చేయాలి. కిందిస్థాయి సిబ్బంది ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వారి అటెండర్లకు సదుపాయాలు కల్పించడంలో ఆర్ఎంఓ దే కీలక పాత్ర. కానీ పేట్లబుర్చ్ ఆసుపత్రికి వచ్చే అటెండర్ ల నుంచి కింది స్థాయి సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం లో ఆయన పూర్తిగా విఫలమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన పాత్ర కూడా ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.