హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
నాదర్ గూల్ డివిజన్ (పాత 4 వ వార్డు) అల్మాస్ గూడ గ్రామం
శ్రీ వేంకటేశ్వర కాలనీ కి సంబంధించి కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.38 లక్షలు జీహెచ్ఎంసీ సాధారణ నిధులు మంజూరు, టెండర్ ప్రక్రియ పూర్తి కావటడంతో సంబంధిత కాంట్రాక్టర్ త్వరలో పనులు మొదలు పెట్టనున్న నేపథ్యంలో అభివృద్ధి జరిగి రోడ్డు సమస్య తీరుతుందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం కాలనీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసుల తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లారెడ్డి కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. ఈ నిధులతో రెండు రోడ్లకి సంబంధించి పనులు పూర్తి కాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ అభివృద్ధి కి సహకరించాలని కోరుతూ గత ఫిబ్రవరి నెలలో కాలనీ అధ్యక్షుడు మధు సూదన్ రెడ్డి ఇంకా కొంత మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లా రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ కిచన్నగారి లక్ష్మా రెడ్డిని కలిసి వెంకటేశ్వర కాలనీలో అంతర్గత రోడ్లు పెండింగ్ లో ఉన్నాయని, అద్వాన రోడ్లతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారులకు సంబంధించి తగిన నిధులు విడుదల చేయించటానికి కృషి చేయాలని కోరగా, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని ఈ విషయమై ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లి అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయిస్తామని కేఎల్ఆర్ హామీ ఇవ్వటం జరిగిందన్నారు. కేఎల్ఆర్ హామీ ఇవ్వటం ఆ తర్వాత వారం రోజుల్లో శంషాబాద్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు బడంగ్ పేట్ సర్కిల్ అధికారులు కాలనీకి వచ్చి రోడ్లకి సంబంధించి అంచనాలు వేసి సంబంధిత అధికారులకి పంపించటం.. ఆ వెంటనే నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కాలనీ అభివృద్ధికి రూ. 38 లక్షల నిధులు కేటాయించటంతో సీఎం రేవంత్ రెడ్డికి, ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకి, నియోజకవర్గ ఇంచార్జ్ కేఎల్ఆర్ కి, జోనల్ కమిషనర్ చంద్రకళకి, బడంగ్ పేట్ సర్కిల్ అధికారులకు, స్థానిక బడంగ్ పేట్ సర్కిల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నవారు మల్లా రెడ్డికి వెంకటేశ్వర కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నవారు మల్లారెడ్డి మాట్లాడుతూ.. సదర్ కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మధు సుధన్ రెడ్డి తో పాటు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు దయాకర్ రెడ్డి, రాము నాయక్, శ్రీకాంత్ రెడ్డి, వంశీధర్, జనార్దన్ రెడ్డి, శ్రీనాథ్ చారి, రమేష్ బాబు, రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.