లట్టుపల్లి సప్తయాతన ఆలయంలో ఘనంగా సామూహిక కుంకుమార్చన
భక్తులతో కిటకిటలాడిన శ్రీ లలిత దేవి ఆలయం భక్తులకు అన్నప్రసాద వితరణ మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రిపోర్టర్ విజయ్ కాంత్ బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామంలో వెలసిన సప్తయాతన ఆలయంలోని శ్రీ చక్రపురవాసిని.. శ్రీ లలిత దేవి ఆలయంలో శుభముహూర్తంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని భక్తి భరితంగా ఆరాధించారు. ఉదయం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య...