లాల్ దర్వాజా వీధులన్నీ చెత్త.. చెత్త..!
లాల్ దర్వాజా వీధులన్నీ చెత్త.. చెత్త..! ప్రధాన రోడ్ పై రోజుల తరబడి పేరుకుపోయిన టన్నులకొద్ది చెత్త అధికారుల ఏం చేస్తున్నట్టు.. గుడ్డి గాడిద పళ్ళు తోముతున్నారా..? స్థానిక ప్రజల ఆగ్రహం మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ప్రధాన రోడ్డుపై గత కొన్ని రోజులుగా చెత్త తొలగించకపోవడంతో భారీగా చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ప్లాస్టిక్, కుళ్లిన ఆహార వ్యర్థాలు, వైద్య వ్యర్థాల నుండి వెలువడుతున్న దుర్వాసనతో పాదచారులు నడవడం కష్టంగా...