వడ్డీ లేని రుణాలు ప్రభుత్వ ప్రచారానికే పరిమితం
మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య వడ్డీ లేని రుణాలు ప్రభుత్వ ప్రచారానికే పరిమితమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆర్పీల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆర్పీలు మాట్లాడుతూ.. గత 5 నెలలుగా తమకు జీతాలు అందడం లేదని, సర్వే నిర్వహించినందుకు రావాల్సిన పారితోషికం కూడా ఇప్పటివరకు చెల్లించలేదని వాపోయారు. రూ.5 లక్షలు మంజూరైనప్పటికీ ఒక్క రూపాయి కూడా...