నెట్టెంపాడ్ నాగర్ దొడ్డి గ్రామ సర్పంచులు కె. మల్లా రెడ్డి, మహేశ్వరి మాబన్న
మన తొలివెలుగు, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి గడ్డం సుధాకర్
ధరూర్ మండలంలోని నాగర్ దొడ్డి గ్రామ కొత్త ఆర్& ఆర్ సెంటర్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాగుంట ఆలయ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి వడ్ల కొనుగోలు సెంటర్ ను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అందుబాటులో వడ్ల కొనుగోలు సెంటర్ ఏర్పాటు కావడం రైతులకు అదృష్టం లాంటిదని అన్నారు. ప్రతి ఒక్క రైతులు సెంటర్ ను వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏయిఓ వెంకట్రాములు, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచు కె.మల్లా రెడ్డి, నెట్టెంపాడ్ గ్రామ సర్పంచు మహేశ్వరీ మాబన్న, ఉప సర్పంచు మునెమ్మ మల్లేష్, జంగం నాగేంద్రoమ్మ, నెట్టెంపాడ్, నాగర్ దొడ్డి గ్రామ వార్డు మెంబర్స్, ఐకేపీ సెంటర్ సభ్యులు, మహిళా సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, విఓఎ,శ్రీనివాస్ రెడ్డి, శివన్న, మాజీ సర్పంచ్ ఫాతిమా బసిర్, వడ్ల బసన్న, శరణు బస్సప్ప, హనుమంతు రెడ్డి, సంగారు నర్సింహా రెడ్డి, వెంకట్రాములు, పంతులు శివన్న, ఈరన్న, శంకర్, కరెంటు తిమ్మప్ప, ఆంజనేయులు, సురేష్, అంజి, భగవంతు, సత్యరం రంగప్ప, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.