MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 7:49 pm Posted by : MANA TOLIVELUGU

విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని లేమూర్ గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి ఆకాంక్షించారు. కందుకూరు మండల పరిధిలోని లేమూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎలుక సంజీవరెడ్డి , 6వ వార్డు సభ్యులు డప్పు భవాని మహేందర్ తదితరులు నూతనంగా చేరిన చిన్నారులకు సర్పంచ్, ఉపాధ్యాయులు, పలకలపై అక్షరాలు దిద్దించారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ అభ్యాసన పుస్తకాలు, ఆట వస్తువులను అందించారు. విద్యార్థుల చదవడం, రాయడం నైపుణ్యాలను పరిశీలించారు. చిన్నారులు ఉత్సాహంగా అక్షరాలు, సంఖ్యలు రాస్తూ తమ ప్రతిభను చాటారు.

అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఉపాధ్యాయుల కృషిని ప్రజాప్రతినిధులు అభినందించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.