మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్
ఫలక్‌నుమా విద్యుత్ సరఫరా సబ్ స్టేషన్, ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఛత్రినక శివగంగ నగర్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థపై విస్తృత మెయింటెనెన్స్ డ్రైవ్ చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ల పరిశీలన, లోడ్ బ్యాలెన్సింగ్, కరెంట్ లీకేజీల సరిచేత పనులు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు సమాచారంతో తరచుగా వస్తున్న ఓవర్ ఓల్టేజ్, ట్రిప్పింగ్ సమస్యలకు పరిష్కారం చేయడమే మా బాధ్యత అని అధికారులు చెప్పుకొచ్చారు. స్థానికులు సూచించిన స్పాట్‌లపై ప్రత్యేక ఫోకస్ చేసి సమస్యలు పరిష్కారం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఇ శివ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఇ), (ఏడిఇ) కే రాజు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్స్, లైన్ ఇన్స్పెక్టర్ రంగ రావు, సిబ్బంది సంతోష్ కుమార్ పాల్గొన్నారు. స్థానికులు అధికారులు స్పందించి వెంటనే పని ప్రారంభించారని హర్షం వ్యక్తం చేశారు. అధికారుల విజ్ఞప్తి మేరకు టీజీఎస్పీడీసీఎల్, విద్యుత్ సమస్యలు ఉన్నవారు హెల్ప్ లైన్ 1912 లేదా సంబంధిత సబ్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.