MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:05 pm Posted by : MANA TOLIVELUGU

విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క, దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

 

విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క, దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలని బీజేపీ క్లస్టర్ 1 అధ్యక్షులు పసునూరి బిక్షపతి, చారి, క్లస్టర్ 2 అధ్యక్షులు తులసి ముకేశ్ ముదిరాజ్ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు పసునూరి బిక్షపతి చారి, తులసి ముకేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బడంగ్‌పేట్‌ సర్కిల్ మీర్ పేట్ కార్పోరేషన్ పరిధిలో విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. గుర్రపు డెక్క ద్వారా అధికంగా ఉన్న దోమలతో ఆరోగ్య సమస్యలతో ప్రజలు పడుతున్న కష్టాలను అధికారులను కలిసి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుర్రపు డెక్క తీయడానికి కావలసిన మెషినరీ, అప్రూవల్ ప్రాసెస్ కు రెండు నుండి మూడు నెలల సమయం పడుతుందని అప్రూవల్ రాగానే గుర్రపు డెక్క తీస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మూడు నెలల తరువాత ఇప్పటికైన మీర్ పేట్ బీఆర్ఎస్ నాయకులు దీని గురించి ఆలోచించడం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చాలా సంతోషమన్నారు. చెరువులలో గుర్రపు డెక్క పెరగడంతో దోమలు విపరీతంగా అభివృద్ధి చెంది కనీసం ఇంటి బయట 2 నిమిషాలు నిలబడలేని పరిస్థితి నెలకొంది అన్నారు. దోమలు కుట్టడంతో డెంగ్యూ మలేరియా వంటి పలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైన అధికారులు స్థానిక బడంగ్ పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య వెంటనే దీనిపైన స్పందించి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా బడంగ్ పేట్ లో ఉన్న అన్ని చెరువులలో నుండి గురేపు డెక్క తీసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.