అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జీహెచ్ఎంసీ 60వ మీర్ పేట్ డివిజన్ (జిల్లెల గూడ) కమలా నెహ్రూ నగర్ కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవత విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు నూతనంగా నిర్మించిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. వేదపండితులు వేద మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హోమం, చండీ హోమం, యాగం, మహా పూర్ణవతి, అత్యంత వైభవోపేతంగా కన్నులపండువగా నిర్వహించారు. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహానికి పాలాభిషేకం, జలాధివాసము, నవ నీతాధివాసం, ధాన్యాధివాసం నిర్వహించారు. అమ్మవారికి శంకు చక్రాలతో పాలాభిషేకం ముత్యాలమ్మ విగ్రహ ఊరేగింపుగా నూతన ఆలయానికి యాగశాల ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులచే పూర్ణకుంభ స్వాగతం పలికి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు అరకల కామేష్ రెడ్డి, అరకల భూపాల్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ,సిద్దాల బీరప్ప, దయానంద్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, భూపేష్ గౌడ్ , పోరెడ్డి భాస్కర్ రెడ్డి, కాలనీవాసులు, భక్తులు సబితా ఇంద్రారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.