MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 8:44 pm Posted by : MANA TOLIVELUGU

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సుదర్శన నారసింహ యాగం, శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం 

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ :

అలియాబాద్ ఫూల్ బాగ్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల పాటు దివ్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 4 నుండి జూన్ 6 వరకు శ్రీ సుదర్శన నారసింహ యాగం, హవనం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనున్నాయి.

తేదీ 4న, గురువారం ఉదయం సుప్రభాతం, అంకురార్పణ, విష్వక్సేన పూజ, యాగశాల ప్రవేశం, మూల కుంభ ఆరాధన, లక్ష్మీ నరసింహ హవనం, శాంతి పాటం, 5న శుక్రవారం, రోజున సుప్రభాతం, మూల కుంభ ఆరాధన, శ్రీ లక్ష్మీ నారాయణ హోమం, శాంతి పాటం. 6న శనివారం రోజున సుప్రభాతం, మూల కుంభ ఆరాధన, సుదర్శన నారసింహ హవనం, మహా పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ. మధ్యాహ్నం 11 గంటలకు శ్రీ పద్మావతి అలువేల్మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి శాంతి కల్యాణం, ఉత్సవం సందర్భంగా. ఈ యాగ మహోత్సవం, కల్యాణమహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.