రహదారులపై మురుగు నీటితో నరకయాతన పడుతున్న శ్రీరామ కాలనీ వాసులు
ప్రజా పాలనలో.. ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు ప్రవర్తిస్తున్న జీహెచ్ఎంసీ జల్ పల్లి సర్కిల్ అధికారులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య పైన పటారం.. లోన లొటారం.. అంటే ఇదేనేమో. శ్రీరామ కాలనీ చూడడానికి ఒక అందమైన సిటీ మాదిరిగా కనిపిస్తుంది. అందమైన భవంతులు కనిపిస్తాయి. ప్రధాన రహదారిపై దుకాణాలు, హోటల్స్, పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఏ సమస్యలు లేనట్టుగా అనిపిస్తుంది. కానీ కాలనీ, బస్తీలలో రహదారులు అస్తవ్యస్తంగా మురుగుతో నిండి పోయి...