MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 7:12 pm Posted by : MANA TOLIVELUGU

శ్రీరామ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

శ్రీరామకాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకులు కొంగర సుభాష్ కోరారు. జల్ పల్లి సర్కిల్ పరిధిలోని శ్రీరామ కాలనీలో నెలకొన్న సమస్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ. సబితా ఇంద్రారెడ్డికి, యువ నాయకులు కార్తీక్ రెడ్డి కి శ్రీనగర్ కాలనీలోని వారి నివాసంలో కొంగర సుభాష్ బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులతో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ.. ముఖ్యంగా శ్రీరామ కాలనీలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్య స్మశాన వాటిక గురించి , జల్ పల్లి సర్కిల్లో నివాస గృహాలపై పెంచిన టాక్స్ లు తగ్గించాలని విన్నవించారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందిని పెంచి శానిటేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. వినతి పత్రాలు స్వీకరించిన సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి సమస్యల పట్ల సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారని సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండు నర్సింగ్, లక్ష్మణ్ , శంకర్, నరేష్, సచిన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.