శ్రీ గాయత్రీ వెంకటేశ్వర యోగానంద ఆశ్రమంలో దామోధర్ రెడ్డి, శశికళ దంపతుల ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిబిరం

మన తొలివెలుగు, తెలంగాణా బ్యూరో ప్రతినిధి సాయి కిషోర్ కనుగుల శ్రీ గాయత్రీ వెంకటేశ్వర యోగాశ్రమంలో దామోధర్ రెడ్డి, శశికళమ్మ పుణ్య దంపతులు ప్రతి సంవత్సరం మే నెలలో ఉచిత వేసవి శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రావిరాల చుట్టు పక్కల ప్రాంతాల్లోని చిన్న పిల్లలు, విద్యార్థులను ఆహ్వానించి తమ సొంత ఖర్చులతో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిబిరంలో విద్యార్థులకు శ్రీమద్భగవద్గీత, యోగాసనాలు, ప్రాణాయామం, భజనలు, కీర్తనలు, ఆటలు, పాటలు వంటి వాటిలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలతో పాటు శారీరక, మానసిక దృఢత్వం...