సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద అనంతారం, తాజ్‌పూర్, హనుమాపురం, మన్నెవారి పంపు ప్రాంతాలకు చెందిన రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 5.30...