సభ్యత్వాలకు సిద్ధంగా ఉండండి – సామ మహేందర్ రెడ్డి పిలుపు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైనా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సామ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కందుకూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో...