MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 10:23 pm Posted by : MANA TOLIVELUGU

సమస్యలను తక్షణమే పరిష్కరించండి 

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 

ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి  

మన తొలివెలుగు, మెదక్ జిల్లా బ్యూరో ప్రతినిధి లింగం రాజ్ :

ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణి దరఖాస్తులలో పెన్షన్ల కోసం 15, భూ భారతి 24, ఇందిరమ్మ ఇండ్ల కోసం 15, ఇతర దరఖాస్తులు 40, మొత్తం 94 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వచ్చి సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కరించి సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.