సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు సహాయం కోసం పోలీసుల వైపే చూస్తారు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య : సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు సహాయం కోసం పోలీసుల వైపే చూస్తారని, బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత పోలీసులపైనే ఉందని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ కార్యాలయం ఆవరణలో ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పోలీసులు ప్రతిజ్ఞ చేశారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం...