సమస్యల పరిష్కారానికి గ్రామసభలే వేదికలు
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మన తొలివెలుగు, మెదక్ జిల్లా బ్యూరో ప్రతినిధి లింగం రాజ్ : సమస్యల పరిష్కారానికి గ్రామసభలు సమర్థవంతమైన వేదికలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గ్రామంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4, 6,...