MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 5:59 pm Posted by : MANA TOLIVELUGU

సరూర్‌నగర్ ఎస్సై మారయ్య గౌడ్‌కు ఘనంగా సన్మానం 

సన్మానించిన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి

మన తొలివెలుగు సిటీబ్యూరో :

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో గత రెండు సంవత్సరాలుగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి, బదిలీపై వెళ్తున్న మారయ్య గౌడ్ ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన అందించిన సేవలను అభినందిస్తూ, కొత్త బాధ్యతల్లో కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రజలకు అందించిన సేవలు, పోలీస్ శాఖలో ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న మారయ్య గౌడ్ కి భవిష్యత్తులో మరిన్ని విజయాలు, ఉన్నత పదవులు లభించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోహిత్, రవి కుమార్ రెడ్డి, గోవర్ధన్,విజయ్, శివ పాల్గొన్నారు.