సరూర్‌నగర్ ఎస్సై మారయ్య గౌడ్‌కు ఘనంగా సన్మానం 

సన్మానించిన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి మన తొలివెలుగు సిటీబ్యూరో : సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో గత రెండు సంవత్సరాలుగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి, బదిలీపై వెళ్తున్న మారయ్య గౌడ్ ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన అందించిన సేవలను అభినందిస్తూ, కొత్త బాధ్యతల్లో కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందించిన సేవలు, పోలీస్ శాఖలో ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు....