MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:09 pm Posted by : MANA TOLIVELUGU

సరూర్ నగర్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ కి సన్మానం   

సన్మానం చేసిన ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ నాయకులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

సరూర్ నగర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన శ్రీకాంత్ ని ఉమ్మడి రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, యువజన నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కి ఉమ్మడి రామకృష్ణాపురం డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, శానిటేషన్ విషయంలో స్వీపర్ల సంఖ్యను పెంచాలని వారు కోరారు. అందుకు డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించి త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గట్ల రవీంద్ర, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, శ్రీ ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ కుమార్, ముప్పిడి లింగస్వామి గౌడ్, జెల్లా జగన్నాథం, ఎస్.కె మమ్మద్, పగిళ్ల భూపాల్ రెడ్డి, బొడ్డుపల్లి మహేందర్, నబీ, రఫీ, రామకృష్ణ గౌడ్, కిరణ్ కుమార్, సాయికుమార్, మంచుకొండ శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, దోర్నాల చంద్రమౌళి, కృష్ణారావు, వెంకటరమణారెడ్డి, ప్రేమ్ నాయక్, కందుకూరి సుదర్శన్, గుణగంటి రమేష్ గౌడ్, మోహన్ రెడ్డి, భవాని, యాదయ్య, శ్రీనివాస్ గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.