సర్కారీ జాగా.. వేసేయ్ పాగా..!
₹. 50 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్ పాతబస్తీలో బూడిదిగడ్డ కబ్జా..!? తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మకాలు వాటితోనే విక్రయానికి అడ్వాన్సులు..? బలి పశువులవుతున్న అమాయకులు..! చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రజా ఆస్తీ కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు కబ్జాదారుడిపై చర్యలు తీసుకోండి - స్థానికుల డిమాండ్ మన తొలివెలుగు తెలంగాణ బ్యూరో : పాతనగరంలో ఓ కబ్జారాయుడు (నార్త్ ఇండియన్ సెటిలర్) పెట్రేగిపోతున్నాడు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్నిచదును చేసి పైసా.. పైసా కూడబెట్టిన అయాయకులకు...