MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 1:11 pm Posted by : MANA TOLIVELUGU

సర్వే నెంబర్ 700 భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

పట్టణంలోని 700 సర్వే నెంబర్లు భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ పట్టణంలోని 700 సర్వే నెంబర్లు పట్టాలి ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న అనేకమంది పేదలు ఇండ్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారని అదేవిధంగా చాలీచాలని ఇంటిలో సమస్యలతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికలకు ముందు అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని వెంటనే అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్డిఓ కృష్ణారెడ్డికి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, కార్యవర్గ సభ్యులు గంధమల మాతయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు, పట్టణ నాయకులు బర్ల వెంకటేష్, వల్దాస్ అంజయ్య, చింతల శివ, కొత్త లలిత, ఈర్ల రాహుల్, వెంకటేష్, రియాజ్, తాళ్ల పెళ్లి శివ, మన్నె రాజు, కన్య బోయిన అరుణ, ఇక్కుర్తి కళావతి, సోమయ్య పాల్గొన్నారు.