సర్వే నెంబర్ 700 భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ పట్టణంలోని 700 సర్వే నెంబర్లు భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ పట్టణంలోని 700 సర్వే నెంబర్లు పట్టాలి ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న అనేకమంది పేదలు ఇండ్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారని అదేవిధంగా చాలీచాలని ఇంటిలో సమస్యలతో జీవనం సాగిస్తున్నారని అన్నారు....