MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 8:32 pm Posted by : MANA TOLIVELUGU

సర్.. నిష్పక్షిపాతంగా నిర్వహించాలి

స్పెషల్ ఇంటెన్స్యూ రివిజన్ (సర్) ఓటు మ్యాపింగ్ నీ పరిశీలించిన స్థానిక మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ పరిధిలోని కైసర్ నగర్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు సవరణ జాబితా కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ ఉప కమిషనర్ వెంకటరమణ తో కలిసి ఓటు మ్యాపింగ్ నీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్ఓ లు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని, అదేవిధంగా నకిలీ ఓట్లను తొలగించేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ బీఎల్వోల నుండి ఎమ్యునరేషన్ ఫారం ను తీసుకొని తమ వివరాలను నమోదు చేసి ఓటు హక్కును పొందాలని అదేవిధంగా, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నూతన ఓటు హక్కును ఈ కార్యక్రమంలో పొందవచ్చు అని తెలియజేశారు, స్థానిక ఓటర్లు బీఎల్ఓలకు సహకరిస్తూ సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం ఉప కమిషనర్ వెంకటరమణ, బూత్ లెవెల్ ఆఫీసర్లు, కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.