సాంఘిక శాస్త్రంలో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం

ముఖ్యఅతిథిగా డిఈవో రమేష్ కుమార్ మన తొలివెలుగు, నాగర్ కర్నూలు బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్ నాగర్‌కర్నూల్ జిల్లాలోని గవర్నమెంట్ హైస్కూల్లో మంగళవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సోషల్ పోరం మరియు క్లాస్ మెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్) సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రపుల్ చంద్రా రెడ్డి, డాక్టర్ రమేష్ చంద్ర, తిరుమల ఎలక్ట్రికల్...