MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 4:10 pm Posted by : MANA TOLIVELUGU

సామాజికవేత్త కోల రవీందర్ ముదిరాజ్ కు సూర్య చంద్ర అవార్డు 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని సూరారంకు చెందిన సామాజికవేత్త కోల రవీందర్ ముదిరాజ్ కు సూర్య చంద్ర అవార్డు – 2026 ప్రత్యేక అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోహన్ చంద్ర కార్యదర్శి అనిల్ కుమార్ చల్లా రాజశేఖర్ రెడ్డి, కృష్ణమాచార్యులు, జయంత్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. అందులో భాగంగా వివిధ సామాజిక కార్యక్రమాలలో సూరారం కాలనీకి చెందిన ఆర్.ఆర్ రాజేందర్ పిల్లాయి తో పాటు సూరారం కాలనీకి చెందిన సామాజిక పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ఈ అవార్డు అందుకున్నారు. కరోనా సమయంలో ప్రజలను అప్రమత్తత చేస్తూ వారికి నిత్యావసర సరుకులు అందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ప్రతిరోజు ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు ఈత నేర్చుకోవాలని, ఇంట్లో నీటిని కాపాడుకొనుటకై ఇంకుడు గుంతలు తీయించాలని, ప్రతి విద్యార్థి ఇంటి ముందర రెండు మొక్కలు నాటాలని ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించారు. తాను ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు ఏదైనా సహాయపడుతూ రోడ్డులో ట్రాఫిక్ ఉన్నప్పుడు ప్రజలను దాటిస్తాడు రోడ్డు మీద ఏదైనా అరటి తొక్కు వేసిన తొలగిస్తాడు. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని చేతి సంచులు వాడాలని ప్లాస్టిక్ ఇస్తరాకులో భోజనం చేయకూడదని, తాను ఏ శుభకార్యానికి వెళ్ళిన వెంట స్టీల్ ప్లేటు తీసుకెళ్తాడని, పర్యావరణ మీద అలుపెరుగని ఉద్యమం చేస్తున్నాడని, అతను ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి రవీందర్ ముదిరాజ్ అని పలువురు కొనియాడారు. అతని సేవా కార్యక్రమాలు గమనించిన ఈ యొక్క సంస్థ ఆర్గనైజేషన్ వారు కుక్కట్ పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి అవార్డు ఇవ్వడం అందజేశారు.

నా బాధ్యత మరింత పెరిగింది – రవీందర్ ముదిరాజ్

నాకు బాధ్యత పెరిగింది. ఈ అవార్డు తీసుకోవడంతో ఇంకా రెట్టింపు ఉత్సవంతో ప్రజలకు సేవ చేస్తాను. ఈ కార్యక్రమంలో మా నాన్న ఈశ్వరయ్య (రిటైర్డ్ హెడ్మాస్టర్ 86 సంవత్సరాలు) పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.