సామాన్యుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, చిరు ఉద్యోగులపై తీవ్ర భారం పడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. అచ్చే దిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం, ఇప్పుడు అన్ని ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. ధరల...