సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ విభాగం అబ్జర్వర్‌గా బద్దం సతీష్ గౌడ్ నియామకం

కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారమే లక్ష్యం: బద్దం సతీష్ గౌడ్ మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి కానుగుల సాయి కిషోర్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఓబీసీ విభాగంలో సంస్థాగత బలోపేతానికి చేపడుతున్న చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బద్దం సతీష్ గౌడ్ ను సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ విభాగం అబ్జర్వర్‌గా నియమించారు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్, షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు....