MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 8:21 pm Posted by : MANA TOLIVELUGU

సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలి 

జగద్గిరిగుట్ట మాజీ కార్పొరేటర్ జగన్

మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి రమేష్ :

చింతల్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్వోసీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్పకు చెందిన కే. సుజాతమ్మ భర్త కే. మాధవ స్వామి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్వోసీ మంజూరు చేయించగా జగద్గిరిగుట్ట డివిజన్ కు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు బాధిత లబ్దిదారులకు రూ. 1,10,000/- (లక్ష పదివేలు) ల విలువ గల ఎల్వోసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య భద్రత, సంక్షేమం కోసం అలోచించి అనునిత్యం పనిచేసే నాయకులు మన ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, బాబు గౌడ్, నర్సింహా రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.