మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
మియాపూర్ చౌరస్తా లో సోమవారం జరుగనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీతో కలిసి సభ ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలంగౌడ్ పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కార్యాలయం శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఈ సందర్భంగా మియాపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో పరిశీలించి పోలీసు, మునిసిపల్ అధికారులను సమన్వయపరుస్తూ పలు సలహాలు సూచనలు చేశారు.