సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్ :
భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి శ్రీనివాస (దివ్య) ఫంక్షన్ హాల్ లో జూలై 4, 5, 6 వ తేదీలలో నిర్వహిస్తున్న సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భునగిరి మండలం సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం సుందరయ్య భవనం, భువనగిరిలో జరగగా నర్సింహా పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొత్త కొత్త విధానాలతో ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. మరోపక్క పెద్ద ఎత్తున నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్య మానవుని జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. మతోన్మాదాన్ని మను వాద భావజాలాన్ని పెంచి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి, భారత రాజ్యాంగానికి తూట్లు పోడవడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దొడ్డిదారిన అధికారం చేపట్టడానికి ప్రజల ఓట్లను తగ్గించడానికి ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ జాబితా సవరణ అనే కుంటి సాకుతో నిజమైన ఓట్లను తొలగించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిని వెంటనే రద్దు చేయాలని నర్సింహ డిమాండ్ చేశారు. ఈ శిక్షణా తరగతులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రారంభించి బోధిస్తారని వారితో పాటు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.డి జహంగీర్, రాష్ట్ర నాయకులు బండారి రమేష్ బోధిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.