సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జానకి
మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో ప్రతినిధి ఎన్. హరీష్ : జిల్లాలోని సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డీ.జానకి ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌లోని పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణను సమీక్షించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రతి కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని, పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన...