MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 7:41 pm Posted by : MANA TOLIVELUGU

సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించిన పలువురు నాయకులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

మహేశ్వరం మండల కేంద్రం 6వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో హెచ్ఎండీఏ నిధులు రూ. 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, శివగంగా ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగల్ల లాజర్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, బీఆర్ఎస్ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షుడు కటికల మహేందర్ ముదిరాజ్, గ్రామపంచాయతీ సభ్యులు కడమోని స్వాతి ప్రభాకర్, షేక్ ఆజం, ఆకుల వీరిబాబు, రూకేష్ నాయక్, సున్నం స్వప్న కృష్ణ, స్వర్ణ గంటి సంజీవ, కాకి పరమేష్ ముదిరాజ్, పోల్కం సునీతా మహేందర్, మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రెల రాములు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్, శివగంగా ఆలయ కమిటీ డైరెక్టర్లు పోతర్ల తిరుపతయ్య యాదవ్, ఏపూరి సాయిలు, పేయ్యాల దేవేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరం గ్రామ 11 వ వార్డు ఇంచార్జ్ గదగుటి జంగయ్య ముదిరాజ్,10 వ వార్డు ఇంచార్జ్ కాకి మల్లేష్ ముదిరాజ్,14వ వార్డు ఇంచార్జ్ పుట్లగారి చందు, గ్రామస్తులు గాజుల నరసింహ, కున శ్రీనివాస్, ఏపూరి వెంకటయ్య, షేక్ షానవాజ్, తదితరులు పాల్గొన్నారు.