సుందరీకరణ పేరుతో పచ్చని మొక్కలను చంపుతారా..?
నిజాంపేట్ సర్కిల్ బీజేపీ నాయకులు ఆకుల సతీష్ మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్డులో డివైడర్ల బ్యూటిఫికేషన్ పేరుతో ఇప్పటికే పచ్చగా పెరిగిన మొక్కలను తొలగించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని నిజాంపేట్ సర్కిల్ బీజేపీ నాయకులు ఆకుల సతీష్ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజలకు ఆక్సిజన్ అందించే, పర్యావరణాన్ని కాపాడే పచ్చని మొక్కలను సంరక్షించాల్సిన అధికారులు వాటిని తొలగించి మళ్లీ కొత్త మొక్కలు నాటడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు....