MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 1:32 pm Posted by : MANA TOLIVELUGU

సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సంతోష్ కుమార్ చారి నియామకం 

నియామక పత్రం అందజేసిన పార్టీ అధ్యక్షులు చామకూర రాజు

మన తొలివెలుగు | తెలంగాణ బ్యూరో:

సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొత్తోజు సంతోష్ కుమార్ చారి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి కే.వీ గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు చామకూర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సంతోష్ కుమార్ చారి కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సామాజిక న్యాయానికి గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు సామాజిక న్యాయాన్ని విస్మరిస్తున్నాయని, సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న పార్టీ సోషల్ జస్టిస్ పార్టీ అని కే.వీ గౌడ్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి సంతోష్ కుమార్ చారి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.