వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ పల్లి సర్కిల్, జీహెచ్ఎంసీ 63వ డివిజన్ పరిధిలోని షాహీనగర్, కొత్తపేట్, నబీల్ కాలనీ, కొత్తపేట్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వర్షపు నీరు, డ్రైనేజ్, రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ. 2 కోట్ల 25 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తపేట్ నబీల్ కాలనీలో వర్షపు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా దశలవారీగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే అనేక పనులు పూర్తికాగా, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జల్ పల్లి సర్కిల్‌లో ఇప్పటికే వాటర్ లైన్లు, డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, రోడ్ల అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించామని, నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేలా అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా షాహీనగర్, కొత్తపేట్, నబీల్ కాలనీ, కొత్తపేట్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో సీసీ రోడ్ల పనులను తక్షణమే ప్రారంభించి, సానిటేషన్, డ్రైనేజ్, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన బాధ్యత అని అభివృద్ధే తన సంకల్పం అని తెలిపారు.

జీహెచ్ఎంసీ అధికారులు పారిశుధ్యం పై ప్రత్యేక డ్రైవ్ కొనసాగించాలి
ప్రస్తుతం వర్షాకాలంలో ప్రజలు వివిధ అనారోగ్యాల బారిన పడకుండా కాలనీలలో, బస్తీలలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తీసివేయాలని, మురుగు కాలువలను శుభ్రం చేయించాలని జీహెచ్ఎంసీ, అధికారులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాను ఎప్పుడైనా ఉదయం 6 గంటల సమయంలో అకస్మాత్తుగా పర్యవేక్షణ చేస్తానని కాలనీ, బస్తీల్లో పేర్కొని పోయిన చెత్త తీయకుండా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్ రామ్, నాయకులు అబ్దుల్లా సాది, అబ్దుల్లా బిన్ గాలిబ్, షేక్ అఫ్జల్, యంజాల జనార్ధన్, యంజాల అర్జున్, మన్సూర్ అలీ, బర్కత్ అలీ, వెంకట్ రాజిరెడ్డి, ఆరిఫ్ అలీ, ఖరీం, నాగేష్ ముదిరాజ్, మన్నన్, ఖదీర్, బాదర్, మహిళా నాయకురాలు సయ్యదా సమీరా నుస్రత్, సోషల్ మీడియా ఇంచార్జ్ వాసు బాబు, సిల్వేరు సాంబశివ, డిఈ ఇష్రాత్ ఆయేషా , ఏఈలు అరుణ్, సుదర్శన్, వర్క్ ఇన్స్పెక్టర్ రతన్ తదితరులు పాల్గొన్నారు.